Driver Subrahmanyam: గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి..
Driver Subrahmanyam: అనంత్‌బాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని.. సుబ్రహ్మణ్యం తండ్రి డిమాండ్ చేశారు.;
Driver Subrahmanyam: అనంత్‌బాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని.. సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను.. మృతుడి తండ్రి సత్యనారాయణ, దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు కలిసారు. సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం కోరారు. తన కొడుకు విషయంలో న్యాయం జరిగేలా చూడాలన్నారు.
పోలీసుల తీరుపై తమకు అనేక అనుమానాలున్నాయని దళిత ఐక్య వేదిక నేత కన్వీనర్ బూసి వెంకట్రావు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు.. ఎమ్మెల్సీ రద్దు కోరుతూ గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. అనంత్ బాబుకు బెయిల్ రాకుండా చూడాలని.. కేసును సీబీఐతో విచారణ జరపాలన్నారు. మరోవైపు తన మాటలను గవర్నర్ సానుకూలంగా విన్నారని దళిత సంఘ నేతలు తెలిపారు.