Tirumala : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్ చల్
Tirumala : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. గజరాజుల సంచారంతో వాహనదారులను అప్రమత్తంచేశారు టీటీడీ అధికారులు.;
Tirumala : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. గజరాజుల సంచారంతో వాహనదారులను అప్రమత్తంచేశారు టీటీడీ అధికారులు. సాయంత్రం వేళ ఏడవ మైలురాయివద్ద అటవీప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు ఘాట్ రోడ్డుపై సంచరించాయి. దీంతో వాటిని గుర్తించిన వాహనదారులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో టీటీడీసిబ్బంది ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను అప్రమత్తంచేసి... ఏనుగులను అడవీప్రాంతంలోకి మళ్లించే చర్యలు చేపట్టారు. ఏనుగులు రోడ్డుపైకి రాకుండా చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను టీటీడీ అదనపు ఈవో ధర్మారావు ఆదేశించారు.