జగన్ పడేసే డబ్బులకు కక్కుర్తి పడి చాలా మంది వైసీపీ బ్యాచ్ చాలా దారుణాలకు పాల్పడ్డారు. మరీ ముఖ్యంగా జగన్ హయాంలో టీడీపీలోని మహిళలపై, నారా భువనేశ్వరి, చంద్రబాబు, లోకేష్, పవన్ పై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టారు. ఇక దీనిలో కొందరు స్వదేశంలో ఉన్నవాళ్లే కాదు, ఎన్నారై పేరుతో విదేశాల్లో ఉంటూ కూడా ఈ దారుణాలకి పాల్పడ్డారు. ఆన్‌లైన్‌లో ఫేక్ ఐడీలు సృష్టించి, మహిళల గౌరవం దెబ్బతినేలా పోస్టులు పెట్టారు. కొందరు అయితే ఎన్నారై అంటూ విదేశాల్లో ఉంటూ టీడీపీ, జనసేన నేతలపై, మహిళలపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అందుకే నేడు మాళపాటి విజయ్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
ఆయన మహిళలపై అత్యంత దారుణంగా చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పంచ్ ప్రభాకర్ లాంటి కొందరు పశువుల డాక్టర్లు అమెరికా, లండన్ లో ఉంటూ ఆడవారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఈ పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి ప్రొఫైల్ ఫొటోలు కూడా ఫేక్ పెట్టుకుంటున్నారు. అంటే తన ఫేస్ చూపించడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఆయన వేరే వాళ్లను బాడీ షేమింగ్ చేస్తుంటారు. తన నిజమైన ముఖాన్ని చూపించడానికి భయపడుతూనే, ఇతరులపై, ముఖ్యంగా మహిళలపై బాడీ షేమింగ్ చేయడం ఎంత దారుణం. జగన్ పడేసే డబ్బులకు కక్కుర్తి పడి, టీడీపీ మరియు జనసేన నాయకులపై అత్యంత దారుణమైన పోస్టులు పెట్టారు.
ఇప్పుడు విజయ్ భాస్కర్ ఒక్కడే అరెస్ట్ అయ్యాడు. ఈ దెబ్బతో మిగతా వాళ్లు ఇండియాకు రావాలంటేనే వణికిపోతున్నారు. అటు పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి తాజాగా మరో పోస్టు పెట్టాడు. విజయ్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అత్యంత అక్రమం అన్నాడు. మరి ఆడవారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడం అరాచకం అని ఈ మహానుభావుడికి తెలియదేమో కాబోలు. అంటే జగన్ చెబితే ఏం చేసినా కరెక్టేనా. అది కరెక్ట్ కాదు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకుంటే ఇలా అంటారా.. అంటే వీళ్ల అరాచకాలపై చట్టం పనిచేయొద్దా. చేస్తే వెంటనే కులం కార్డు వాడేస్తారా. వీళ్లు ఎన్ని ఫేకుడు ప్రచారాలు చేసినా.. ఆడవారి జోలికి వచ్చిన వీరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి నేతలు అంటున్నారు.