JD Lakshmi Narayana : యాక్టివ్ రాజకీయాల్లోనే ఉన్నా : జేడీ లక్ష్మీ నారాయణ
విశాఖ స్టీల్ ను ప్రవేటికరణ చేయమని, విశాఖ డివిజన్ తో కూడిన ప్రత్యేక రైల్వే జోన్ ఏపీకి ఇస్తామనే ప్రకటనను ప్రధాని మోడీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయించాలని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.తిరుపతి పర్యటనకు విచ్చేసిన లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు.తాను యాక్టివ్ రాజకీయాల్లోనే ఉన్నానని, ఏపీకి న్యాయపరంగా రావాల్సిన హక్కులపై మోడీ విశాఖ పర్యటనలో ప్రకటన చేయాలని అన్నారు. ,ఆయన ప్రకటన తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని,అయితే 2029 తరవాతే జమిలి ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై, ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీన్ని కక్ష్య సాధింపులు అనడం సరికాదని, కక్ష్య సాధింపులే అయితే రాష్ట్రనికి పెట్టుబడులు రావని పేర్కొన్నారు.