Jagan : జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే.. ఇంత దారుణమా.

Update: 2025-10-25 04:59 GMT

అబద్ధాలు ఆడటంలో ఆస్కార్ అవార్డు ఏదైనా ఉంటే అది కచ్చితంగా మాజీ సీఎం జగన్ కు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయిలో చెప్పేస్తుంటారు ఆయన. అధికారం పోయిన తర్వాత అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి రకరకాల అబద్ధాలు ఆడిస్తూ.. ఏపీ ప్రజలను మళ్లీ మోసం చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్నడూ లేని విధంగా చాలా చాకచక్యంగా అబద్ధాలు చెప్పేశారు. అసలు వైసీపీ నేతలకు కల్తీ మద్యం అంటేనే తెలియదని.. వైసీపీ నేతలు అంటేనే సత్యహరిశ్చంద్రులు అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చేశారు. ఇంకా మరీ దారుణం ఏంటంటే ఏపీలో ఇప్పుడు కల్తీ మద్యం తయారు చేసే అమ్ముతోంది కూటమి ప్రభుత్వమని దారుణమైన అబద్ధం ఆడేశారు. క్యూఆర్ కోడ్ ఎందుకు స్కాన్ చేయాలంటూ ఏమాత్రం అవగాహన లేని కామెంట్ చేశారు. మొత్తంగా చూస్తే జగన్ ప్రెస్ మీట్ లో ఒక్కటంటే ఒక్క నిజం కూడా లేదు. ముందే రాసుకు వచ్చిన స్క్రిప్టు చదివారే తప్ప.. ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.

కామెరున్ దేశంలో వైయస్ అనిల్ రెడ్డి, వైయస్ సునీల్ రెడ్డి నిర్వహించిన రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే కల్తీ మద్యం తయారీ కంపెనీ గురించి ఎందుకు చెప్పలేదు. కామెరున్ దేశంలో అక్కడి ప్రజలు ఈ కంపెనీ మీద తిరగబడిన విషయం.. అక్కడి ప్రభుత్వం ఈ కంపెనీని సీజ్ చేసిన విషయం ఎందుకు చెప్పలేదు. నెల రోజుల్లో ఈ కంపెనీ మూసేసి వెళ్ళిపోవాలంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశించిన విషయం గురించి ఎందుకు చెప్పలేదు. అన్ని నిజాలే చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం ఎందుకు దాచిపెట్టాడు. ఎందుకంటే దీని గురించి చెబితే పరువు మొత్తం పోతుంది కాబట్టి. జయచంద్ర రెడ్డి టిడిపి వ్యక్తి అంటూ చాలా తేలికగా అబద్ధం ఆడేశారు. జయచంద్ర రెడ్డి తో తమకసలు సంబంధమే లేదు అన్నట్టు బిల్డప్ ఇచ్చేశారు. కానీ ప్లాన్ ప్రకారమే జయచంద్రారెడ్డి టిడిపి లోకి వచ్చినట్టు జగన్ చెప్పలేదు. ఇక హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి కూడా చాలా రకాల అబద్ధాలు చెప్పారు. హైటెక్ సిటీని కట్టింది చంద్రబాబు కాదన్నారు. హైటెక్ సిటీ కోసం నేదుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. నిజమే కానీ శంకుస్థాపన మాత్రమే చేశారు. దాన్ని కట్టించింది ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకువచ్చింది పూర్తిగా చంద్రబాబు మాత్రమే. శంషాబాద్ కట్టింది చంద్రబాబు కాదన్నారు జగన్. చంద్రబాబు హయాంలోనే కదా శంషాబాద్ కు శంకుస్థాపన చేసింది. చంద్రబాబు హయాంలోనే కదా భూమి సేకరించి నిర్మాణం పూర్తి చేసింది.

ఆ మాత్రం కూడా జగన్ కు తెలియదా. బిల్ గేట్స్ హైదరాబాద్ లో ఎవరి ఇంటికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని కలవడానికి రాలేదు కదా. నేరుగా అప్పటి సీఎం చంద్రబాబును కలవడానికి వచ్చారు. మైక్రోసాఫ్ట్ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చారు. ఐటీ రంగంను హైదరాబాద్ కు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే. ఔటర్ రింగ్ రోడ్డు కు శంకుస్థాపన చేసింది కూడా చంద్రబాబు. హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకువచ్చి టెక్ రంగంలో డెవలప్మెంట్ చేసింది సీఎం చంద్రబాబు మాత్రమే. ఆ విషయాలను ఎవరిని అడిగినా చెబుతారు. కానీ మాజీ సీఎం జగన్ మాత్రం ప్రజలకు అవేవి తెలియదు కావచ్చు అనుకుని రకరకాల అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఆయన నుంచి ఇంతకుమించి ఆశించడం కూడా వృధానే.

Tags:    

Similar News