Jogi Ramesh : జోగి రమేశ్ చేసేదంతా అరాచకమే.. అందుకే జగన్ మెచ్చాడా..?

Update: 2025-11-03 07:38 GMT

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. కల్తీ మద్యం కేసులో ఆయన్ను సిట్, ఎక్సైజ్ అధికారులు అరెస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జోగి రమేశ్ అరెస్ట్ పై అటు వైసీపీ పార్టీలో కూడా పెద్దగా సానుభూతి లేదు. ఇటు ప్రజలు అయితే మంచి పని చేశారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. జోగి రమేశ్ మీద ఇంత వ్యతిరేకత ఏర్పాడటానికి కారణం ఆయన వ్యవహరించిన తీరు. జోగి రమేశ్ మొదట్లో   నుంచి గెలిచి.. ఆ తర్వాత ఆ పార్టీనే తిట్టి వైసీపీలో చేరాడు. 2014లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మైలవరంలో జోగి గురించి మొత్తం తెలిసిన ప్రజలు.. ఆయన్ను గెలిపించడం కష్టమే అని జోగి భావించారు.

అందుకే 2019లో వైసీపీ నుంచే పెడనలో పోటీ చేశారు. అనుకోకుండా అప్పుడు పెడనలో గెలిచారు. కానీ ఆయనకు ఎమ్మెల్యే పదవి సరిపోలేదు. మంత్రి పదవి కావాలి అనిపించింది. అది కావాలంటే జగన్ ను మెప్పించాలి. దాని కోసం ఏకంగా అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ఇంటి మీదకే నలుగురు రౌడీలను వేసుకుని కర్రలు పట్టుకుని వెళ్లారు. ఎంత ధైర్యం లేకపోతే ఒక మాజీ సీఎం ఇంటికి రౌడీలను వేసుకుని వెళ్తాడు. అప్పట్లో అది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయినా సరే జగన్ జోగిని మెచ్చుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇంటి మీదకే వెళ్లాడు కాబట్టి జగన్ కు ఎక్కడలేని పైశాచిక ఆనందం కలిగింది.

అందుకే జోగి రమేశ్ ను పిలిచి.. నువ్వు చంద్రబాబు ఇంటిమీదకు వెళ్లావంటే నువ్వు కచ్చితంగా మంత్రి పదవికి అర్హుడివి అని కేబినెట్ లోకి తీసుకున్నాడు. ఇక మంత్రి పదవి వచ్చాకనే అక్రమ దందాలు, సెటిల్మెంట్లు, కబ్జాలు అనేకం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కల్తీమద్యం అతిపెద్ద అంశం. టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి వైసీపీ నేత. అందుకే ఇక్కడి నియోజకవర్గం ఎంచుకుని.. కల్తీ లిక్కర్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఆయన సాగించిన అరాచకాలలో ఇది అతిపెద్దది. వందలాది మంది ప్రాణాలు తీసిన కల్తీమద్యం కేసులో ఆయన్ను అరెస్ట్ చేస్తే ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. అంతే గానీ అక్రమ అరెస్ అని ఒక్క వైసీపీ బ్యాచ్ తప్ప ఎవరూ అనట్లేదు. దీన్ని బట్టి జోగి రమేశ్ ఏ స్థాయిలో అరాచకాలు చేశారో.. ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.


Full View

Tags:    

Similar News