ముంబై ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు సమావేశం
సంక్షోభాలను ఎదుర్కోవటంలోనే సమర్థత బయటపడుతుందని.. విపత్తులను అవకాశాలుగా మలచుకుని ముందుకు వెళ్లాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు..;
సంక్షోభాలను ఎదుర్కోవటంలోనే సమర్థత బయటపడుతుందని.. విపత్తులను అవకాశాలుగా మలచుకుని ముందుకు వెళ్లాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో బాంబే ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు వర్చువల్ విధానంలో మాట్లాడారు. కరోనా సృష్టించిన సంక్షోభాలను వివిధ దేశాలు సమర్థంగా ఎదుర్కొని బయటపడ్డాయని.. వర్చువల్ కార్యాలయాలు, డిజిటల్ వేదికలు కరోనా సంక్షోభంలో వచ్చిన వినూత్న ఆలోచనలే అని అన్నారు. కొత్త రాష్ట్రంలో పరిపాలనను అనేక సంక్షోభాలతో ప్రారంభించామని.. వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపామని.. సులభతర వాణిజ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఏపీని అభివృద్ధి బాటలో నడిపామని చంద్రబాబు విద్యార్థులకు వివరించారు.