Nellore: టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలిపై మాజీ మంత్రి అనిల్ అనుచరులు దాడి..!
Nellore: నెల్లూరు నగరంలోని మూడవ పోలీస్‌స్టేషన్ ఎదుట.. టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతిపై దాడి జరిగింది.;
Nellore: నెల్లూరు నగరంలోని మూడవ పోలీస్‌స్టేషన్ ఎదుట.. టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతిపై దాడి జరిగింది. నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రి అనిల్‌ని విమర్శించారని దాడి జరిగినట్లు టీడీపీ వర్గీయులు పేర్కొన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ప్రోత్సాహంతోనే తనపై దాడి జరిగిందని కప్పర రేవతి పేర్కొన్నారు. అనిల్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే.. చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. తన కుటుంబానికి ఏమి జరిగినా దానికి అనిల్ బాద్యత వహించాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అనిల్ కుమార్ యాదవ్ రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆమె ధ్వజమెత్తారు.