Perni Nani : అజ్ఞాతంలోకి పేర్ని నాని.. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఫ్యామిలీ!

Update: 2024-12-14 10:30 GMT

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతం లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై ప్రధాన నిందితురాలిగా ఆమెపై కేసు నమోదైంది. అలాగే పేర్ని నాని వ్యక్తిగత సహాయకుడు మానస తేజపైనా పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ క్రమంలో మూడు రోజు లుగా పేర్ని నాని అందుబాటులో లేరు. ఇంట్లో సైతం ఎవరూ లేకపోవడంతో వారి ఫ్యామిలీ అజ్ఞా తంలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News