Nellore: నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. మతిస్థిమితం లేని మహిళ సజీవదహనం..
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో తీవ్ర విషాదం నెలకొంది.;
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో తీవ్ర విషాదం నెలకొంది. దర్గా దగ్గర మతిస్థిమితం లేని వ్యక్తుల సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా అనే మహిళ సజీవ దహనం కాగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
అయితే ఈ కేంద్రాన్ని అనధికారంగా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. మానసిక స్థితి నయం అవుతుందనే నమ్మకంతో ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. బాధిత కుటుంబాల నుంచి వేలకు వేలు తీసుకుంటున్నా.. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడివారు చెబుతున్నారు.