Omicron India: తెలుగు రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు..
Omicron India: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన జారీ చేసింది.;
Omicron India: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చినట్లు తెలిపింది.
గత నెల 27న ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన ఆ వ్యక్తికి విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కరోనాగా నిర్దారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీకి నమూనాలు పంపగా.. ఆ పరీక్షలో ఒమిక్రాన్‌గా గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో అధికారులు.. నిన్న తిరిగి టెస్ట్ చేయించగా రెండోసారి టెస్ట్‌లో నెగెటివ్‌గా నిర్దారణ అయినట్లు పేర్కొంది. ఏపీకి వచ్చిన 15 మంది విదేశీ ప్రయాణికుల నమూనాల సేకరించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.