ఉప్పాడలో మత్స్యకారుల నిరసన: కాలుష్య పరిశ్రమలు తొలగించాలని డిమాండ్...

Update: 2025-09-23 08:51 GMT

తీరప్రాంతంలో ఉన్న కాలుష్య పరిశ్రమలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు ఉప్పాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉప్పాడ రహదారిని ఇరువైపులా మూసేసి బైఠాయించారు. ఈ నిరసన కారణంగా ఉప్పాడ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా

మత్స్యకారులు మాట్లాడుతూ.. పరిశ్రమల నుండి విడుదలవుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రంలో చేపలు చనిపోతున్నాయని, దీనివల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేయకుండా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు మత్స్యకారులు.

Tags:    

Similar News