AP High court : ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష..!
2015లో భూమి వ్యవహారంలో .. నష్టపరిహారం చెల్లించమని హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటి వరకు బాధిత మహిళకు నష్టపరిహారం అందజేయలేదు.;
AP High court : ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు.. హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. 2015లో భూమి వ్యవహారంలో .. నష్టపరిహారం చెల్లించమని హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటి వరకు బాధిత మహిళకు నష్టపరిహారం అందజేయలేదు. దీంతో రిటైర్డ్ IAS మన్మోహన్ సింగ్‌కు నెల రోజల జైలు శిక్ష, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబుకు 2 వారాలు, రావత్‌కు నెల రోజులు, ముత్యాల రాజుకు 2 వారాల జైలు శిక్షతో పాటు వీరిందరికీ వేయి రూపాయల చొప్పున జరిమానా విధించారు. దీంతో పాటు బాధిత మహిళకు లక్ష రూపాయల చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అదికూడా.. ప్రభుత్వ నిధి నుంచి కాకుండా అధికారుల సొంత డబ్బుతో చెల్లించాలని కోర్టు తెలిపింది. అయితే ప్రతివాదుల అభ్యర్ధన మేరకు శిక్షను నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది.