Former Minister Roja : డైలమాలో రోజా.. పార్టీ నుంచి నో సపోర్ట్.

Update: 2026-04-11 06:00 GMT

మాజీ మంత్రి రోజా పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయిన రోజాకు.. ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మొత్తం ఇప్పుడు బయటపడుతుంది. ఆడుదాం ఆంధ్రాలో మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి దాదాపు రూ.40 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అధికారులు దాదాపు 3,000 పేజీల రిపోర్టును ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఆ రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు. ఈ కుంభకోణం విషయంలో దాదాపు వందల మందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఎక్కువ చూపించి నిధులను పక్కదారి పట్టించారు అనే విషయాలను చాలా క్లుప్తంగా రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు.

అయితే ఇలా రోజా అవినీతి బయటపడటంతో ఆమె డైలమాలో పడిపోయారు. పైగా అటు పార్టీ నుంచి కూడా ఎలాంటి సపోర్టు రావట్లేదు. ఇప్పటికే పార్టీకి చెందిన అనేకమంది మంత్రులు ఎమ్మెల్యేలు కుంభకోణాలు, అవినీతి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వాళ్ల అవినీతి మొత్తం బయటపడుతుండటంతో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన రోజాకు ఇప్పుడు పార్టీ నుంచి మద్దతు లేకపోవడంతో ఒంటరి అయిపోయారు. రోజా అవినీతి కేసు గురించి మాట్లాడితే ఎక్కడ తమకు కూడా ఆ కేసు మూలాల్లో ఇరుక్కుపోతామో అనే ఉద్దేశంతో చాలామంది దూరంగా ఉంటున్నారంట.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ నేతలు మొత్తం ఇలా అవినీతి కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీకి చెందిన నేతలు కూడా ఎంత పెద్ద స్థాయిలో అవినీతి చేయలేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ మంత్రి రోజా ఇలా అవినీతి కేసులో ఒంటరి అయిపోవడంతో జగన్ ను కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట. కానీ జగన్ కూడా పెద్దగా స్పందించట్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఎటూ తోచక తాను ఒంటరి అయిపోయాను అంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారంట మాజీ మంత్రి రోజా.

Tags:    

Similar News