వైసిపి బ్యాచ్ మరీ దారుణంగానే రెచ్చిపోతూనే ఉంది. మొన్నటిదాకా పబ్లిక్ మీటింగ్ లో ఎక్కడ చూసినా సరే వైసిపి కార్యకర్తలు రప్పా రప్పా అంటూ ఎంతగా రెచ్చిపోయారో మనం చూసాం. ఇక ఇప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో ఏకంగా ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలో 2029లో జగన్ చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ రాస్తున్నారు. ఈ ఫ్లెక్సీ ల మీద హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఫ్లెక్సీలు పెట్టే వారికి కఠిన శిక్షలు విధించాలంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టడానికి వారికి ఎంత ధైర్యం అంటూ హైకోర్టు సంచలన కామెంట్లు చేసింది. ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఫ్లెక్సీలు బహిరంగంగా పెట్టడం అంటే రౌడీయిజాన్ని అధికారికం చేయడమే అంటూ హైకోర్టు ఫైర్ అయింది.
ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులను ఆదేశించింది ధర్మాసనం. దీంతో వైసిపి బ్యాచ్ కు పెద్ద షాక్ తగిలినట్టు అయిపోయింది. ఈ ఫ్లెక్సీలపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ పెడుతున్న దారుణమైన పోస్టులపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వైసిపి కార్యకర్తలు పెడుతున్న దారుణమైన పోస్టులను వెంటనే తొలగించాలని వారిపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ హైకోర్టు సూచించింది. నిజమే మరి వైసీపీ నేతల తీరు ఆ స్థాయిలోనే ఉంది. వాళ్లు పెడుతున్న పోస్టులు అత్యంత దరిద్రంగా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే.
మహిళలను అవమానించడం వైసిపి బ్యాచ్ కు కొత్త ఏమీ కాదు. నిండు అసెంబ్లీలోనే బూతులు మాట్లాడిన చరిత్ర వైసిపి మంత్రులది. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఏకంగా ఇలా ఫ్లెక్సీల రూపంలో తమ సైకోతనాన్ని బయటపెడుతున్నారు అని కూటమినేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని అటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. ఎంతమంది అరెస్టు అవుతున్నా సరే జగన్ మాత్రం వారి బ్యాచ్ ను కంట్రోల్ లో పెట్టట్లేదు. పైగా వాళ్ళు చేస్తుంది ప్రజాసేవ అన్న రేంజ్ లో ఆయన బిల్డప్ ఇవ్వటం మరీ దారుణం అంటున్నారు కూటమినేతలు.