విజయవాడలో బయట నానావెజ్ తినాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.. సండే సరదాగా నాన్ వెజ్ తినాలి అంటేనే హడలి పోవాల్సిన పరిస్థితి. కాసుల కక్కుర్తి కోసం హోటళ్ల యజమానులు.. మాంసం విక్రయ దారులు అడ్డదారులు తొక్కుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఇటీవల బెజవాడ బెంజ్ సర్కిల్‌లో బార్బీక్యూ నేషన్ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో భయపెట్టే వాస్తవాలు బయటపడ్డాయి. భారీగా నిల్వ ఉంచిన.. కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు.. దీంతో అప్రమత్తమైన కొర్పొరేషన్ అధికారులు.. నగరంలోని ప్రముఖ హోటళ్లకు మాంసం విక్రయిస్తున్న మటన్ షాపులపై ఫోకస్ చేశారు.
వన్ టౌన్‌లో ఉన్న మటన్ షాపులపై ఉదయాన్నే దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచి మాంసం విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించారు. కుళ్లిపోయిన మాంసం విక్రయిస్తున్న షాపులను గుర్తించి వారిపై చర్యలకు సిద్ధమయ్యారు.