అమరావతిలో ఆగిన మరో రైతు గుండె!

రాజధాని తరలిపోతుందన్న ఆందోళన రైతుల ఉసురు తీస్తోంది.. అమరావతిలో మరో రైతు గుండె ఆగిపోయింది. రాజధానికి 60 ఎకరాలిచ్చిన మల్లెల శ్రీనాథ్ చౌదరి ఇవాళ మృతి చెందారు.

Update: 2020-12-20 07:01 GMT

రాజధాని తరలిపోతుందన్న ఆందోళన రైతుల ఉసురు తీస్తోంది.. అమరావతిలో మరో రైతు గుండె ఆగిపోయింది. రాజధానికి 60 ఎకరాలిచ్చిన మల్లెల శ్రీనాథ్ చౌదరి ఇవాళ మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి మాజీ సర్పంచ్ మల్లెల శ్రీనాథ్ చౌదరి ఏపీ భవిష్యత్తు కోసం 60 ఎకరాల భూమిని రాజధాని కోసమిచ్చారు.

అమరావతి నిర్మాణం పూర్తైతే అద్భుతంగా ఉంటుందని రైతు శ్రీనాథ్‌ చౌదరి ఆశించారు.. కానీ ప్రభుత్వం మూడు రాజధానులకు ఓటేయడంతో అప్పటి నుంచి మనస్థాపానికి గురయ్యాడు.. ఎన్ని రకలుగా పోరాడుతున్నా ప్రభుత్వం మనసు మారడం లేదు దీంతో తీవ్ర మనస్థపానికి గురయ్యాడు శ్రీనాథ్‌ చౌదరి.

తాడికొండ సమితి అధ్యక్షుడుగా, రాయపూడి పంచాయతీ సర్పంచ్​గా.. 20 సంవత్సరాలు శ్రీనాథ్ చౌదరి సేవలందించారు. 2004లో అమరావతిలోని శ్రీ శ్రీ రామకృష్ణ హిందూ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్​గా విశేష సేవలు అందించి.. ప్రజల మన్ననలు పొందారు. ఆయన మృతి తమకు తీరని లోటని.. రాజధాని గ్రామ ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News