APలో మహిళలకు గుడ్ న్యూస్ అందింది. ఉచిత బస్సు సౌకర్యంపై కీలక మైన అప్ డేట్ ఇచ్చింది అక్కడి సర్కార్. ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు.. ఫేస్‌బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభ ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముహూర్తంతో సహా చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం అంటూ పోస్ట్ పెట్టారు.