GANESH POOJA: విఘ్నేశ్వరుడికి ప్రముఖుల తొలి పూజ
రాష్ట్రం వర్థిల్లాలని వినాయుకుడికి ప్రత్యేక పూజలు;
వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వినాయకచవితి పూజల్లో చంద్రబాబు పాల్గొని..విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఇంటి పెరటిలోనే నిమజ్జనం చేసుకునేలా మట్టి గణపతి, విత్తన గణపతి ప్రతిమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారి్‌సతో తయారు చేసిన విగ్రహాల్లో జిప్స మ్, గంధకం, మెగ్నీషియం వంటివి ఉంటాయని, అవి నీటిలో కలిసి, పెద్ద ఎత్తున నీటి కాలుష్యంతో ముప్పు వాటిల్లుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి దంపతుల గణపతి పూజ
వినాయకచవితి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి-గీత దంపతులు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గణపతి పూజ నిర్వహించారు. వేద పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనాలు అందించారు. రేవంత్ కూతురు నైమిషా దంపతులు, సీఎంవో సిబ్బంది విఘ్నేశ్వర పూజలు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని పూజించినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా గణపతి పూజలో పాల్గొన్నారు. పర్యావరణ హిత వినాయకులను పూజించాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు పడుతున్నా మండపాలకు తరలివచ్చి భక్తులు గణనాథుడిని పూజించారు వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేషుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది.