మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ఇండియాలో గ్యాస్ కొరత ఏ స్థాయిలో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఏజెన్సీల ముందు కిలోమీటర్ల పొడవునా ప్రజలు క్యూలైన్ లో నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. కానీ ఏపీలో ఆ స్థాయి పరిస్థితులు రానివ్వకుండా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలెర్ట్ అవుతోంది. అధికారులతో సీఎం సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ కొరత లేకుండా చూడాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశిస్తున్నారు. దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవల్లో ప్రజలు గ్యాస్ లేకుండా ఇబ్బంది పడొద్దని ఆదేశిస్తున్నారు. ఏజెన్సీలు బ్లాక్ లో అమ్మకాలు జరిపితే వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశిస్తున్నారు.
అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగొద్దని హెచ్చరిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అక్రమాలు అడ్డుకోవాలని.. ఇలాంటి సమయంలో ఏజెన్సీలు సిండికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిపై గట్టి నిఘా పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులు, అధికారులపై సీఎం ఉంచారు.
దాంతో అధికారులు కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు బుక్ చేసుకున్న వెంటనే సిలిండర్ డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీంతో సీఎం చంద్రబాబు దూరదృష్టిపై ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ల విషయంలో సీఎం చంద్రబాబు అటు కేంద్రంతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు.