Sri Sathya Sai District : రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం .. ముఠా అరెస్ట్

Update: 2025-08-02 07:01 GMT

రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్, శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం ఎద్దుల వాండ్లవల్లి తండా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం ఎద్దుల వాండ్లపల్లి తండా వద్ద రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లమాడ మండలం ఎద్దుల వాండ్లపల్లి తండా వద్ద కొందరు గ్రామస్తులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల వైర్లను చోరీ చేసే వ్యక్తులనే అనుమానంతో కొందరిని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన అక్బర్ బాషా, ఎమ్మిగనూరుకు చెందిన ఆవుల ప్రసాద్ విజయవాడకు చెందిన కార్తికేయ చైతన్య కనగానపల్లి కి చెందిన సుంకర వీరన్న నల్లమాడ మండలం ఎద్దుల వాండ్లపల్లి తండాకు చెందిన భాస్కర్ నాయక్ తో కలిసి మా వద్ద మహిమలు గల రాగి చెంబు గలదని ఈ చెంబుతో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చని ప్రజలను నమ్మించి వారి వద్ద నుంచి మోసపూరితంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరిలో భాస్కర్ నాయక్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టు ఆయన నాయకత్వంలోనే ఈ మోసం జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం భాస్కర్ నాయక్ పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి పోలీసులు ఒక మారుతి కారు మరియు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News