అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన గంటా శ్రీనివాసరావు
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంతో భేటీ అయ్యారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు.;
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామాలే బలమైన అస్త్రం అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంతో భేటీ అయ్యారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు. ఉక్కు పరిరక్షణ కోసం మంత్రులు రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. త్వరలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. జేఏసీ నిర్ణయించే అభ్యర్ధి విశాఖ నార్త్‌లో పోటీ చేస్తారని తెలిపారు.