Garimella Balakrishna Prasad : ప్రభుత్వ లాంఛనాలతో.. గరిమెళ్ల అంత్యక్రియలు

Update: 2025-03-12 08:30 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాల కృష్ణప్రసాద్ అంత్య క్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గరిమెళ్ల పార్థివ దేహానికి కలెక్టర్ వెంకటేశ్వర్ నివాళులర్పించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టినట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలకు స్వర కల్పన చేసిన గరిమెళ్ల మరణం తీరని లోటు అని తెలిపారు. అన్నమయ్య కీర్తనలు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి ఎంతో గర్వకారణం అని తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామ్ రఘునాథ్, అన్నమాచార్య ప్రాజెక్టు సిబ్బంది కళాకారులు, ఆస్థాన గాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News