పేలిన గ్యాస్ సిలిండర్.. వృద్ధురాలు సజీవదహనం
మంటల్లో చిక్కుకుని తుమ్మలపల్లి లక్ష్మీ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది.;
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి గాంధీనగర్ మార్కెట్ దగ్గర ఉన్న పూరిగుడెసలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని తుమ్మలపల్లి లక్ష్మీ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. అగ్ని కీలలు మరింత వ్యాపిండంతో అక్కడే ఉన్న మరో పూరిల్లు దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.