14.8 కిలోల బంగారు బిస్కెట్లు.. బిల్లులు లేవని..
కర్నూలు జిల్లాలో 6 కోట్ల 86 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.;
కర్నూలు జిల్లాలో 6 కోట్ల 86 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా 14 కిలోల 800 గ్రాముల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి కర్నూలు వైపు ఆర్టీసీ బస్సు వస్తుండగా సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజు అనే ప్రయాణికుడి సంచిలో బంగారు బిస్కెట్లు గుర్తించారు. అతను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నగల దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. యజమాని ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ బంగారం దుకాణం నుంచి బంగారు బిస్కెట్లు తెస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ బంగారానికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు.