AP : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదల

Update: 2025-03-22 08:15 GMT

ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో రూ.400కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఈ పథకానికి మెుత్తంగా రూ.788కోట్లు విడుదలయినట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పెండింగ్‌ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు స్పష్టం చేశారు. విద్యార్థుల్ని క్లాసులకు హాజరుకానివ్వకుండా, హాల్‌ టికెట్లు నిలిపివేయడం, పరీక్షలు రాయనీయకుండా అడ్డుపడడం వంటి చర్యలకు దిగితే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీ అకౌంట్‌లకు జమ చేస్తుంది.

Tags:    

Similar News