నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు మద్దతుతో అమరావతి అభివృద్ధికి 4 వేల 200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో అమరావతి అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి అభిృద్ధిపై దృష్టి సారించారు. అయితే ఇందుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర మంత్రులను కలిసి నిధుల విడుదలు చేయాలని అభ్యర్థించారు. దాంతో కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. తాజాగా అమరావతికి నిధులు విడుదల చేసింది.