చంద్రబాబుతో భేటీ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ..!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.;
Chandrababu File Image
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో తనకున్న ఇబ్బందులను ఆయన అధినేతకు వివరించారు. పార్టీలో పరిస్థితులపై ఇటీవలే ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థాపక సభ్యుడైన బుచ్చయ్య అలకబూనడంతో.. అధిష్టానం అప్రమత్తమైంది. మాజీ హోంమంత్రి చినరాజప్ప నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలు బుచ్చయ్యతో పలుమార్లు మాట్లాడి బుజ్జగించారు. ఏదైనా ఉంటే నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడాలని సూచించారు. దీంతో అమరావతిలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబుతో బుచ్చయ్య సమావేశమయ్యారు.