తిరుమల జేఈఓ బసంత్‌కుమార్‌పై బదిలీవేటు
జీఏడీలో రిపోర్టు చేయాలంటూ అర్ధరాత్రి ఆదేశాలు జారీ;
తిరుమల జేఈఓ బసంత్‌కుమార్‌పై బదిలీ వేటు వేసింది. వెంటనే జీఏడీలో రిపోర్టు చేయాలంటూ అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇటీవల తిరుమలలో పర్యటించగా.. ఆయనతో పాటు బసంత్‌కుమార్ కూడా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌గా ఉన్న బసంత్‌కుమార్.. విధులను విస్మరించి.. నిమ్మగడ్డ పర్యటనలో పాల్గొనడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్‌ఈసీ దర్శన ఏర్పాట్లు చూసే అధికారులుండగా.. నెల్లూరు నుంచి బసంత్‌కుమార్ రావడమేంటని ప్రశ్నిస్తూ.. ఆయనపై బదిలీవేటు వేసింది. అయితే నెల్లూరు జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌గా మాత్రం ఆయన కొనసాగవచ్చంటూ ఆదేశాల్లో సర్కారు స్పష్టం చేసింది.