Ontimitta Brahmotsavam : ఒంటిమిట్టలో రాముడి బ్రహ్మోత్సవ శోభ

Update: 2025-04-09 13:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం స్వామి వారు నవనీతకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీరామనవమి రోజు నుంచి భక్తులు విశేష సంఖ్యలో పూజలకు హాజరవుతున్నారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ తరపున ఈ కళ్యాణోత్సవం జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు.

Tags:    

Similar News