chandrababu : చంద్రబాబుని కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు..!
chandrababu : అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గ్రూప్ వన్ అభ్యర్ధులు... చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు.;
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు గ్రూప్ వన్ అభ్యర్ధులు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గ్రూప్ వన్ అభ్యర్ధులు... చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు. 2018 గ్రూప్ వన్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పందగా ఉందని... చంద్రబాబుకు వివరించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యువేషన్‌లో 62 శాతం వ్యత్యాసం ఉందని, ఈ రెండింటి మూల్యాంకనంలో తేడా రావడమే అనుమానాలు తావిస్తోందన్నారు. మాన్యువల్ మూల్యాంకనంలో80 శాతం తెలుగు మీడియం అభ్యర్ధులకు అన్యాయం జరిగిందన్నారు. డిజిటల్, మాన్యువల్‌లో ఏది పారదర్శకంగా జరిగిందో తేలాలంటే... న్యాయ విచారణ జరపాలని కోరారు.