GST: ఆంధ్రప్రదేశ్ పైకి... తెలంగాణ కిందకు

కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన పన్ను వసూళ్లు.. ఏపీలో నాలుగు శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. తెలంగాణలో మాత్రం 5 శాతం తగ్గిన ఆదాయం

Update: 2025-10-03 04:30 GMT

కేం­ద్ర ప్ర­భు­త్వం శ్లా­బు­లు తగ్గిం­చిన తర్వాత ఆం­ధ్ర­ప్ర­దే­శ్ లో జీ­ఎ­స్టీ వసూ­ల్లు పె­ర­గ­గా.. తె­లం­గా­ణ­లో మా­త్రం తగ్గా­యి. సె­ప్టెం­బ­రు నెల ద్వి­తీ­యా­ర్ధం­లో దే­శ­వ్యా­ప్తం­గా పన్నుల వసూ­ళ్లు జో­రం­దు­కు­న్నా­యి. ఏపీ­లో జీ­ఎ­స్టీ వసూ­ళ్లు గత ఏడా­ది సె­ప్టెం­బ­రు­తో పో­లి­స్తే 4 శాతం మే­ర­కు పె­రి­గా­యి. గత ఏడా­ది సె­ప్టెం­బ­రు­లో రూ.3,506 కో­ట్ల జీ­ఎ­స్టీ వసూ­లు కాగా, ప్ర­స్తు­తం రూ.3,653 కో­ట్ల­కు చే­రిం­ది. తె­లం­గా­ణ­లో మా­త్రం జీ­ఎ­స్టీ వసూ­ళ్లు 5 శాతం తగ్గా­యి. గత ఏడా­ది సె­ప్టెం­బ­రు­లో తె­లం­గా­ణ­లో రూ.5,267 కో­ట్లు వసూ­లు కాగా, ఈ ఏడా­ది రూ.4,998 కో­ట్లు మా­త్ర­మే వచ్చా­యి. సె­ప్టెం­బ­ర్‌ నా­టి­జి­కి జీ­ఎ­స్‌­టీ వసూ­ళ్లు 9 శా­తా­ని­కి పె­రి­గి.. 1.89 లక్షల కో­ట్ల­ను వసూ­ళ్లు చే­శా­య­ని కేం­ద్ర ప్ర­భు­త్వ గణాం­కా­లు వె­ల్ల­డిం­చా­యి. ఇటీ­వల తగ్గిం­చిన పన్ను రే­ట్లు కూడా సె­ప్టెం­బ­ర్‌ నుం­చి అమ­ల్లో­కి వచ్చిన సం­గ­తి తె­లి­సిం­దే. 2024 సె­ప్టెం­బ­ర్‌­లో జి­ఎ­స్‌­టి వసూ­ళ్లు 1.73 లక్షల కో­ట్లు. గతే­డా­ది ఇదే నె­ల­తో పో­లి­స్తే జి­ఎ­స్‌­టి వసూ­ళ్లు ఈ ఏడా­ది 9.1 శాతం ఎక్కు­వ­గా వసూ­ళ్ల­య్యా­యి. ఇక గత నె­ల­తో పో­లి­స్తే 1.5 శాతం ఎక్కువ అని ప్ర­భు­త్వ డేటా స్ప­ష్టం చే­సిం­ది. సె­ప్టెం­బ­ర్‌ 22 నుం­చి జి­ఎ­స్‌­టి 2.0 పన్ను రే­ట్లు అమ­ల్లో­కి వచ్చా­యి. ఈ నె­ల­లో స్థూల దే­శీయ ఆదా­యం 6.8 శాతం పె­రి­గి 1.36 లక్షల కో­ట్ల­కు చే­రు­కుం­ది. ది­గు­మ­తు­ల­పై పన్ను సె­ప్టెం­బ­ర్‌­లో 15.6 శాతం పె­రి­గి.. 52,492 కో­ట్ల­కు చే­రు­కుం­ది. సె­ప్టెం­బ­ర్‌ 2025 నికర జి­ఎ­స్‌­టి ఆదా­యం 1.60 లక్షల కో­ట్లు­గా ఉంది. ఇది సం­వ­త్స­రా­ని­కి 5 శాతం వృ­ద్ధి­ని నమో­దు చే­సిం­ది.

దేశంలో జీఎస్టీ-2.0 సంస్కరణలు గత నెల 22 నుంచి అమలులోకి వచ్చాయి. ఫలితంగా 375 నిత్యావసర వస్తువులు సహా వస్తు సేవలు, ఆటోమొబైల్స్‌, గృహోపకరణాల వస్తువుల ధరలు దిగి వచ్చాయి. ఫలితంగా వాటికి డిమాండ్‌ పెరిగి విక్రయాలు పుంజుకున్నాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు.

 గత నెలలో ఇలా...

గత నె­ల­లో స్థూల జా­తీ­యా­దా­యం 6.8 శాతం మే­ర­కు పె­రి­గి రూ.1.36 లక్షల కో­ట్ల­కు చే­రిం­ది. మరో­వై­పు ది­గు­మ­తుల ద్వా­రా పన్ను రా­బ­డి కూడా 15.6ు వృ­ద్ధి చెం­ది.. రూ.52,492 కో­ట్లు­గా నమో­దైం­ది. ఇక, జీ­ఎ­స్టీ రి­ఫం­డ్లు కూడా 40.1ు మే­ర­కు పె­రి­గి రూ.28,657 కో­ట్లు­గా నమో­ద­య్యా­యి. ని­క­రం­గా జీ­ఎ­స్టీ వసూ­లు రూ.1.60 లక్షల కో­ట్ల­కు చే­రు­కుం­ది. గత ఏడా­ది సె­ప్టెం­బ­రు­తో పో­ల్చి­తే ఇది 5ు అధి­క­మ­ని మా­ర్కె­ట్‌ వర్గా­లు తె­లి­పా­యి. తాజా పరి­ణా­మా­ల­పై డె­లా­యి­ట్‌ పా­ర్ట­న­ర్‌ ఎం.ఎస్‌. మణి స్పం­ది­స్తూ.. జీ­ఎ­స్టీ శ్లా­బు­ల్లో మా­ర్పుల కా­ర­ణం­గా ఆర్థిక కా­ర్య­క­లా­పా­లు మం­ద­గిం­చ­లే­ద­న­డా­ని­కి ఈ వసూ­ళ్లు ని­ద­ర్శ­న­మ­ని తె­లి­పా­రు. సె­ప్టెం­బ­రు వసూ­ళ్ల­తో ఈ ఏడా­ది ఇప్ప­టి­వ­ర­కు సగటు పన్నుల రా­బ­డి రూ.2 లక్షల కో­ట్ల­కు చే­రు­వ­లో ఉన్న­ట్టు చె­ప్పా­రు.

Tags:    

Similar News