Gulab cyclone : ఉత్తరాంధ్రను వణికించిన గులాబ్ తుఫాన్
దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య వాయుగుండం తీరం దాటిన సమయంలో కురిసిన భారీ వర్షానికి శ్రీకాకుళం,విజయనగరం, విశాఖజిల్లా అతలాకుతల మయ్యాయి.;
Gulab cyclone : గులాబ్ తుఫాన్ ఉత్తరాంధ్రను వణికించింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య వాయుగుండం తీరం దాటిన సమయంలో కురిసిన భారీ వర్షానికి శ్రీకాకుళం,విజయనగరం, విశాఖజిల్లా అతలాకుతల మయ్యాయి. తీవ్ర వర్షాల కారణంగా ఇళ్లు, కాలనీలు నీటమునిగాయి. చెట్లునేలకూలాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. కొండచరియలు విరిగిపడ్డాయి. వేలాది పంట నీటమునిగింది. రోడ్లు జలయం కావడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోగోడకూలి ఓ వివాహిత మృత్యువాతపడింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్థంభించిపోయింది.