Guntur council: వాడీవేడీగా గుంటూరు కౌన్సిల్ మీటింగ్..
నిన్న అర్ధాతరంగా ముగిసిన సమావేశాలు ఇవాళ కూడా నిరసనల మధ్యే కొనసాగుతున్నాయి.;
గుంటూరు కౌన్సిల్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. నిన్న అర్ధాతరంగా ముగిసిన సమావేశాలు ఇవాళ కూడా నిరసనల మధ్యే కొనసాగుతున్నాయి. కౌన్సిల్ తీరుపై తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఫైర్ అయ్యారు.వైసీపీ కార్పొరేటర్లు, అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.కార్పొరేషన్ ఏఈ వచ్చేంత వరకు సమావేశం నిలిపేయాలని డిమాండ్ చేశారు.ప్రజల్లోకి వెళితే తిరగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించి నెలలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో ఇప్పుడు అంచనాలు పెరిగి టెండర్లు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికార పార్టీకే చెందిన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం విషయంలో కూడా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయకుండా ఓ ఉన్నతాధికారి ఆదేశాలతో నియామకం చేశామంటూ అధికారులు తెలపడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.కార్పొరేషన్ పనుల్లో తనకు సంబంధం లేకుండా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఇక కౌన్సిల్ సమావేశం ఎజెండాలో 94 ప్రశ్నలు, 322 ప్రతిపాదనలు, 16 ప్రియాంబుల్స్ ఉండగా నిన్న సభ్యులు అడిగిన 43 ప్రశ్నలు మాత్రమే చర్చించారు. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు కనిపించడం లేదు.