GVMC కౌన్సిల్ మీటింగ్‌‌‌లో రసాభాస

GVMC : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో రసాభాస జరిగింది. కౌన్సిల్ హాల్ లోకి పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

Update: 2021-12-10 15:31 GMT

ప్రజాసమస్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల జోక్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విపక్ష నేతలు. ప్రజాసమస్యలపై ప్రశ్నించే హక్కు కూడా హరిస్తారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపడంతో హాల్ నుంచి పోలీసులు వెనుదిరిగారు. అంతకుముందు మేయర్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు విపక్ష లీడర్లు. ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిందే అని పట్టుబట్టారు. జీరో అవర్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. అజెండాలో అంశాలపై చర్చ తర్వాతే అనుమతిస్తామని మేయర్ చెప్పడంతో.... విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విపక్షాల నిరసనతో సభను వాయిదా వేశారు మేయర్. తర్వాత సభ మళ్లీ మొదలైనప్పటికీ... విపక్షాల ఆందోళనలతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

Tags:    

Similar News