ప్రశాంతంగా ముగిసిన GVMC ఎన్నికలు

నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీతో పోల్చుకుంటే గ్రేటర్‌లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది.

Update: 2021-03-10 12:45 GMT

విశాఖలో కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా మూడు చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీతో పోల్చుకుంటే గ్రేటర్‌లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. జీవిఎమ్సీ ఎన్నికల్ల మధ్యాహ్నం 3 గంటల వరకు 47.10 శాతం పోలింగ్ నమోదైంది. ఎలమంచిలిలో 65.10, నర్సీపట్నంలో 63.89 శాతం ఓటింగ్ నమోదైంది. కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల్లో చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు రిగ్గింగ్‌కు పాల్పడిన వైసీపీ నేతలను వదిలి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్‌ గోపాల్‌తో పాటు టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News