ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు ..!
గుంటూరు జిల్లా కొల్లూరులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఇల్లీగల్‌గా కస్టడీకి తీసుకుని... చిత్రహింసలు పెడుతున్నారంటూ షేక్ అక్తర్ రోషన్ పిటిషన్ దాఖలు చేశారు.;
ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా కొల్లూరులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఇల్లీగల్‌గా కస్టడీకి తీసుకుని... చిత్రహింసలు పెడుతున్నారంటూ షేక్ అక్తర్ రోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్నాసనం ఇల్లీగల్ కస్టడీపై సీరియస్ అయ్యింది. ఇల్లీగల్‌గా కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురిచేయడమేంటని ప్రశ్నించింది. తప్పు చేస్తే శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్న హైకోర్టు... ఏడీజీ అధికారితో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.