Sri chitanya Institutions: తుదిశ్వాస విడిచిన..డాక్టర్ బీఎస్ రావు..
శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత.. డాక్టర్ బీఎస్ రావు తుదిశ్వాస విడిచారు.;
శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత.. డాక్టర్ బీఎస్ రావు ఇకలేరు. నిన్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అప్పటి నుంచి జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం పార్థివదేహాన్ని విజయవాడ శివారులోని తాడిగడపకు తరలించారు. అక్కడి సరస్వతీ సౌధం వద్ద ఉన్న సొంతింటి వద్ద ఇవాళ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. బీఎస్ రావు చిన్న కుమార్తె సీమ అమెరికా నుంచి బయల్దేరారు. ఇక రేపు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. డాక్టర్ బీఎస్ రావు మృతిపై చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. విద్యారంగానికి బీఎస్ రావు జీవితాన్ని అంకితం చేశారన్నారు. బీఎస్ రావు 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు.