అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ జేకే.మహేశ్వరి, జస్టిస్ పీఎస్.నరసింహ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్‌పై.. విచారణ జరిపేలా ఆదేశించాలని పిటిషన్లో అవినాష్‌రెడ్డి కోరారు. తల్లి ఆరోగ్యం కారణంగా వారం పాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని, అందుకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించేంత వరకు, తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు అవినాష్‌రెడ్డి. మరోవైపు అరెస్ట్‌ను ఆపేందుకు అవినాష్‌రెడ్డి టీమ్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలోనే మకాం వేసిన కీలక వ్యక్తులు ఓవైపు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అరెస్ట్ జరగకుండా జాప్యం చేస్తూనే.. మరోవైపు అధికార వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.