YCP: రోజాకు సొంత నేతల వార్నింగ్

రో­జా­కు సొంత ని­యో­జ­క­వ­ర్గం నగ­రి­లో­ని స్థా­నిక నే­త­లు తీ­వ్ర­స్థా­యి­లో హె­చ్చ­రి­క­లు

Update: 2025-12-14 06:30 GMT

మాజీ మం­త్రి, వై­సీ­పీ నేత రో­జా­కు సొంత ని­యో­జ­క­వ­ర్గం నగ­రి­లో­ని స్థా­నిక నే­త­లు తీ­వ్ర­స్థా­యి­లో హె­చ్చ­రి­క­లు జారీ చే­శా­రు. రోజా రా­జ­కీయ భవి­ష్య­త్తు ము­గి­సిం­ద­ని, ఇక ఆమె జీ­వి­తం­లో ఇక్కడ గె­ల­వ­లే­ర­ని స్ప­ష్టం చే­శా­రు. రోజా అహం­కా­రం­తో మా­ట్లా­డు­తు­న్నా­ర­ని, ఆమె రా­జ­కీయ జీ­వి­తం తాము పె­ట్టిన భి­క్షే­న­ని మం­డి­ప­డ్డా­రు. శ్రీ­శై­లం బో­ర్డు మాజీ చై­ర్మ­న్ రె­డ్డి­వా­రి చక్ర­పా­ణి­రె­డ్డి మా­ట్లా­డు­తూ.. ఎం­పీ­పీ ఎన్ని­క­లు న్యా­య­బ­ద్ధం­గా­నే జరి­గా­య­ని, 'ఓ అబ్బ­కు పు­ట్టా­వా' అని రోజా మా­ట్లా­డ­టం బా­ధా­క­ర­మ­ని అన్నా­రు. ని­యో­జ­క­వ­ర్గ చరి­త్ర­లో­నే అత్యంత దా­రు­ణం­గా ఓడి­పో­యిం­ది రో­జా­నే అని, రా­బో­యే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో తమ సత్తా చూ­పి­స్తా­మ­ని హె­చ్చ­రిం­చా­రు. వడ­మా­ల­పేట జడ్పీ­టీ­సీ ము­ర­ళీ­ధ­ర్ రె­డ్డి మా­ట్లా­డు­తూ.. రోజా ఫస్ట్రే­ష­న్‌­తో మద­మె­క్కి మా­ట్లా­డు­తు­న్నా­ర­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. టీ­డీ­పీ నుం­చి పా­ర్టీ మారి, తమ దయ­తో­నే రోజా ఎమ్మె­ల్యే అయ్యా­ర­ని గు­ర్తు చే­శా­రు. అమ్ము­లు మా­ట్లా­డు­తూ.. తాము సాయం చే­స్తే­నే రోజా ని­ల­బ­డ్డా­ర­ని, ఆమె, ఆమె కు­టుం­బం నగ­రి­ని దో­చు­కు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ పోరు

కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమానికి సంబంధించి, జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వరకు వాహన ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర డీజీపీకి అధికారికంగా లేఖ రాసింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలు ఈ నెల 10వ తేదీనే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. వీ­టి­ని డి­సెం­బ­రు 15న తా­డే­ప­ల్లి­లో­ని పా­ర్టీ కేం­ద్ర కా­ర్యా­ల­యా­ని­కి తర­లిం­చా­ల్సి ఉంది. ఈ బృ­హ­త్తర కా­ర్య­క్ర­మా­న్ని పు­ర­స్క­రిం­చు­కు­ని జి­ల్లా కేం­ద్రాల నుం­చి తా­డే­ప­ల్లి వరకు వాహన ర్యా­లీ­లు ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు వై­సీ­పీ ప్ర­క­టిం­చిం­ది. ఈ ర్యా­లీ­లు, సం­త­కాల పత్రాల రవా­ణా సజా­వు­గా సా­గేం­దు­కు అను­మ­తి అవ­స­ర­మ­ని, దీని కోసం అన్ని జి­ల్లాల ఎస్పీ­ల­కు స్ప­ష్ట­మైన ఆదే­శా­లు జారీ చే­యా­ల­ని లే­ళ్ల అప్పి­రె­డ్డి తన లే­ఖ­లో డీ­జీ­పీ­ని కో­రా­రు.తాడేపల్లికి పత్రాలు చేరుకున్న అనంతరం, డిసెంబరు 18న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌ను కలిసి ఈ కోటి సంతకాల పత్రాలను అధికారికంగా సమర్పిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి వచ్చిన స్పందనను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

Tags:    

Similar News