Srisailam Dam : శ్రీశైల డ్యాంకు భారీగా వరద.. ఆరు గేట్లు ఎత్తిన అధికారులు

Update: 2025-07-29 11:15 GMT

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో డా్యం ఆరు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,29,743 క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో డ్యాం నుంచి 2,48,900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆరు స్పిల్ వే గేట్ల ద్వారా 1,62,942 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీల నీరు ఉంది.

Tags:    

Similar News