Kadapa Floods: కడప జిల్లాలో వరద బీభత్సం.. 30 మంది గల్లంతు

Kadapa Floods: ఎగువన అన్నమయ్య డ్యామ్‌ రింగ్‌ బండ్‌ తెగిపోయింది.;

Update: 2021-11-19 06:37 GMT

kadapah floods: కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెయ్యేరు వరద ఉధృతికి 30 మంది గల్లంతయ్యారు. ఎగువన అన్నమయ్య డ్యామ్‌ రింగ్‌ బండ్‌ తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా చెయ్యేరులోకి వరద పోటెత్తింది. పుల పుత్తూరులో 30 మంది గ్రామస్తులు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు మొదలుపెట్టారు. నందలూరు వద్ద ఇప్పటికి మూడు మృతదేహాల్ని గుర్తించారు. గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. 

Tags:    

Similar News