ఏపీలోనూ కృష్ణా, గుంటూరు, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అనంతాపూర్ జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ సూచించింది. నైరుతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70.36 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 91.90 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 31% అధికమని అధికారులు తెలిపారు. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, తొమ్మిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెలాఖరుతో నైరుతి రుతుపవనాల సీజన్ ముగుస్తుంది.
సీజన్ ముగిసే నాటికి వర్షపాతం గణాంకాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదు కాకపోవడం విశేషం. మండలాలవారీగా వర్షపా తం నమోదును పరిశీలిస్తే 108 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 283 మండలాల్లో అధిక వర్షపాతం, 216 మండలాల్లో సాధారణ వర్షపాతం, 5 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉన్న ట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.