ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్నాడు పర్యటన రద్దైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో సీఎం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పల్నాడు జిల్లా నర్సరావు పేట మండలం కాకాని గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరుకావాల్సి ఉంది.
కాకాని పంచాయతీలో ఉన్న JNTUలో మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షం కురుస్తుండటంతో చివరి నిమిషంలో అధికారులు వనమహోత్సవాన్ని రద్దు చేశారు. వనమహోత్సవం కోసం కోట్లాది మొక్కలను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసింది. ఐతే.. ఐదురోజుల వర్ష సూచన ఉండటంతో.. అగ్రనేతల పర్యటన రద్దుఅయింది. ఐతే.. ప్లాంటేషన్ మాత్రం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.