High Alert : మరో రెండు రోజులు వానలు.. చంద్రబాబు సర్కార్ హైఅలర్ట్

Update: 2024-09-02 12:15 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరకొస్తా, దక్షిణ ఒరిస్సా ఛత్తీస్ గఢ్ ప్రాంతాలను ఆనుకొని కొనసాగుతోంది.

అది క్రమేనా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే ప్రమాదం ఉంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఒడిశా మల్కన్ గిరికి ఈశాన్యంగా 70 కి.మీ. విశాఖకు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీ కృతమైంది.

మరో 24 గంటల పాటు దక్షిణ కోస్తా, రాయ లసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన రావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

Tags:    

Similar News