Rains in Telugu States : ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులపాటు వర్షాలు

Update: 2024-08-12 12:30 GMT

తెలంగాణలో మరో 3 రోజులపాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలో మరో 2 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఐఎండీ హెదరాబాద్ రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Tags:    

Similar News