అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలప డిన అల్పపీడనం కొనసా గుతుంది. వాయువ్య దిశగా కదు లుతూ గురు వారం అర్ధరాత్రి సమయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు చేరే ఉందని, ఆతర్వాత 24 గంటల్లో దాదా పు ఉత్తరం వైపు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. గురువారం ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లాలో 3 సెంమీ అత్యధిక వర్షపాతం నమోదైంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారా మరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చి మగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. గంటకు 35 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.