Heavy Rains : ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Update: 2025-09-10 08:15 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని...ప్రజలు జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 65,865 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 66,052 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల అవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.30 అడుగుల వద్ద నీరు ఉంది. వరద ప్రవాహం పెరిగితే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News