Heavy Rain : ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

Update: 2025-09-27 06:32 GMT

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం అలుగు పొంగటంతో... కర్నూలు-గుంటూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను నంద్యాల-గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు. ఆదోని పట్టణంలో ఆవుదూడ వంక పొంగి ప్రవహిస్తోంది. ఆదోని శివారులోని రాంజల చెరువు పొంగటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో హంద్రీ ఉగ్రరూపం దాల్చటంతో పంట పొలాలు నీట మునిగాయి. గోనెగండ్ల మండలంలో మల్లెలవాగు ఉప్పొంగింది. దీంతో గంజహళ్లి గ్రామంలోని కాలనీలు నీట మునిగాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.

మరోవైపు కృష్ణవేణి తరంగాల మీదుగా వీస్తున్న చల్లని గాలులు........ కళ్లు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్తు కాంతుల ధగధగలతో శుక్రవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసరాలు కొత్త అనుభూతిని కలిగించాయి. ఈనెల 22 నుంచి ప్రారంభమైన దసరా ఉత్సవాలతో పాటు తొలిసారిగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ తో నగరం మరింత దేదీప్యమానంగా కాంతివంతమైంది. దుర్గమ్మ ఆలయం, పరిసరాలు, మల్లిఖార్జున మండపం, గాలిగోపురంతో పాటు కనకదుర్గ ఫ్లైఓవర్ , ప్రకాశం బ్యారేజీ ప్రాంతాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి

Tags:    

Similar News