Nara Lokesh : లోకేష్ మీద వైసిపి కుట్రలు బట్టబయలు..

Update: 2025-12-30 06:55 GMT

వైసిపి అధికారం పోయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం మీద ఎన్ని రకాల కుట్రలు చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఏ విషయంలో పడితే ఆ విషయం మీద రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ కూటమిలో అలజడి సృష్టించేందుకు జగన్ బ్యాచ్ చేయని కుట్రలు లేవు. ఏది వర్క్ అవుట్ కాకపోయేసరికి ఎంతకైనా తెగించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు లోకేష్ మీద మరో రకమైన కుట్రకు తెర తీశారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడానికి నారా లోకేష్ రెడీ అయ్యాడని.. అందులో భాగంగానే లండన్ వెళ్తున్నాడు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం మొదలుపెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ సీఎం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని.. త్వరలోనే చంద్రబాబు నాయుడుని దించేసి లోకేష్ పగ్గాలు తీసుకుంటారని ఫేక్ పోస్టులు రెడీ చేశాయి వైసిపి మూకలు.

వీళ్ళ అరాచకాలు ఎక్కడిదాకా వెళ్తున్నాయి అంటే ఇప్పుడు లోకేష్ సీఎం అవుతున్నాడు అని తెలియగానే టిడిపిలో అలజడి మొదలు కావాలి. ఇదే విషయాన్ని అటు జనసేన గ్రూపుల్లో కూడా షేర్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు మధ్య విభేదాలు రావాలి కూటమి విచ్ఛిన్నం కావాలి అనేది వైసిపి కుట్రగా అర్ధమైపోతుంది. ఎవరైనా వెన్నుపోటు పొడవాలంటే లండన్ ఎందుకు వెళ్తారు. లోకేష్ ఓపెన్ గానే చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు అని. లండన్ లో ఏమైనా టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారా. లేకుంటే లండన్ లో చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడు టిడిపికి ఉన్నాడా.

మరి అలాంటి వారు ఎవరూ లేనప్పుడు లోకేష్ లండన్ కు వెళితే సీఎం ఎలా అవుతారు. ఆ మాత్రం కూడా ఆలోచించకుండానే ఫేక్ పోస్టులు ఎలా పెడతారు. కనీసం జనాలు నవ్వుతారు అనే విషయం కూడా వైసిపి మర్చిపోతుంది. ఎంతకైనా దిగజారి పరువు తీసుకోవడంలో వైసిపి ఆరాటపడుతోంది. ఎలాగూ కూటమి కలిసి ఉన్నంతకాలం జగన్ సీఎం కాలేడు అనే విషయం వైసిపికి అర్థమైంది. అందుకే ఎలాగైనా కూటమిలో అలజడి సృష్టించి విడిపోయేలా చేయడానికి ఇలా ఎక్కడలేని తప్పుడు ప్రచారాలు చేస్తోంది వైసిపి పార్టీ. ఎవరైనా అధికారంలోకి రావాలంటే ప్రజల తరఫున పోరాడాలి ప్రజలకు మంచి చేస్తామని చెప్పుకోవాలి. అంతేగాని ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టి అధికారంలోకి రావాలి అనుకుంటే ఎప్పటికీ సాధ్యం కాదు అనే విషయాన్ని గ్రహించాలి.


Full View

Tags:    

Similar News